ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజమౌళి మూవీలో చేయాలనుందట!

Tue, Apr 28, 2015
లక్ష్మీ మంచు
లక్ష్మీ మంచు
రాజమౌళి సినిమాలో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు .. అయితే ఈ మాటన్నది మంచులక్ష్మీ కనుక ఈ వార్త ప్రాధాన్యతను .. ప్రత్యేకతను సంతరించుకుంది. విలక్షణ నటిగా .. నిర్మాతగా ఆమె సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞను ఆవిష్కరిస్తూ వస్తోంది. అలాంటి లక్ష్మీమంచు, 'ఝాన్సీ లక్ష్మీబాయి' తన డ్రీమ్ రోల్ అనీ, రాజమౌళి దర్శకత్వంలో ఈ పాత్రలో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. లక్ష్మీ మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. అలాగే విభిన్నమైన పాత్రలను పోషిస్తూ మంచిపేరు తెచ్చుకుంది.

'బుడుగు' చిత్రంలో ఓ తల్లిగా ఆమె అభినయం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా 'దొంగాట' చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో లక్ష్మీమంచు పాల్గొంది. ఈ సందర్భంగా మీ డ్రీమ్ రోల్ ఏంటీ ? ... ఎవరి దర్శకత్వంలో ఆ పాత్రను పోషించాలని ఉందని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆమె పైవిధంగా స్పందించింది. చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రాలను తెరకెక్కించడంలో రాజమౌళికి తిరుగులేదు. పవర్ ఫుల్ పాత్రలను పండించే నైపుణ్యం లక్ష్మికి కావలసినంత వుంది. కాబట్టి లక్ష్మీ ఆశ నెరవేరాలనే ఆశిద్దాం.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)