ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్టార్ హీరోయిన్ అయిపోయినట్టేనా?

Tue, Apr 28, 2015
లక్ష్మీ మీనన్
లక్ష్మీ మీనన్
లక్ష్మీమీనన్ త్వరలో స్టార్ హీరోయిన్ కానుందనే ప్రచారం ఇప్పుడు చెన్నయ్ లో జోరుగా సాగుతోంది. చక్కని రూపం .. సహజమైన నటన .. తను చేసిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటూ ఉండటం .. యూత్ లో క్రేజ్ పెరగడం .. ఇవన్నీ ఆమె కథానాయికగా దూసుకు వెళుతుందనే విషయాన్నే చెబుతున్నాయి. అలాంటిదానికి ప్రత్యేకంగా ప్రచారమెందుకని అనుకోవచ్చు. ఈ ప్రచారం వెనుక మాత్రం ఒక కారణం వుంది. శింబు కథానాయకుడిగా రూపొందనున్న ఒక సినిమాలో ఆయన జోడీగా అమ్మడు ఎంపిక కావడమే.

ఉదయనిధి స్టాలిన్ భార్య .. శింబు కథానాయకుడిగా నిర్మిస్తోన్న ఓ సినిమాకి గాను లక్ష్మీమీనన్ ని కథానాయికగా ఎంపిక చేసిందట. గతంలో శింబు సరసన నటించిన కథానాయికలు స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఆ సెంటిమెంట్ కారణంగా శింబు జోడీగా ఛాన్స్ దక్కించుకోవడానికి కొత్త కథానాయికలు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆ సెంటిమెంట్ ప్రకారం త్వరలో లక్ష్మీమీనన్ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమని అనుకుంటున్నారు. మరి ఈ సెంటిమెంట్ లక్ష్మీమీనన్ విషయంలో ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో .. ఏమో!
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)