ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో తమిళ సినిమాలో జగపతి

Mon, Apr 27, 2015
జగపతి
జగపతి
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా రాణించిన జగపతిబాబు, కొత్తతరం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో కేరెక్టర్ ఆర్టిస్టుగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకు పవర్ ఫుల్ పాత్రలు పడుతున్నాయి. తెలుగులోనే కాకుండా ఇటీవల రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమా ద్వారా తమిళ సినిమాలో కూడా మంచి కేరెక్టర్ చేశాడు.

ఈ క్రమంలో ఆయన తాజాగా మరో తమిళ చిత్రానికి సంతకం చేశాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా ... త్రిష, తాప్సీ హీరోయిన్లుగా రూపొందే చిత్రంలో జగపతి కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)