ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదే ఇళయరాజా గొప్పతనం!

Sat, Apr 25, 2015
ఇళయరాజా
ఇళయరాజా
సుమధురమైన సినీసంగీతంతో దక్షిణ భారతాన్ని ప్రభావితం చేసిన సంగీత దర్శకులలో ఇళయరాజా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సంగీత దర్శకుడిగా పరిచయమైన దగ్గర నుంచి, ఆయనకి గ్యాప్ అనేది తెలియకపోవడం విశేషం. తరాలు గడిచిపోతున్నాయి .. ట్రెండ్ పేరుతో సినిమా పోకడలు మారిపోతున్నాయి. అయినా సినిమా సంగీతానికి సంబంధించినంత వరకూ ఆయనే రాజుగా కనిపిస్తున్నాడు.

ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఎన్నో సినిమాలకు స్వరాలను అందించిన 'లండన్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా'వారు సైతం ఆయన నోట్స్ ని అర్థం చేసుకోవడానికి ఇబ్బందిపడ్డారంటే, ఇళయరాజాకి గల ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 'రుద్రమదేవి' సినిమాకి స్వరాలను సమకూర్చినది .. రీ రికార్డింగ్ ని అందించినది ఇళయరాజానే. ఇందుకుగాను ఆయన లండన్ లోని 'ఏంజిల్ స్టూడియోలో అక్కడి ప్రముఖ సంగీతబృందంతో కలిసి పనిచేశారు.

అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయన ఓ తమిళ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయన ఈ విషయాన్ని గురించి చెప్పారు. తనకి ఇంతటి సంగీత పరిజ్ఞానం దైవానుగ్రహం వలన లభించిందనీ, మొదటి సినిమాకిగాను ఎంత కష్టపడ్డానో, ఇకముందు కూడా అంతేలా కష్టపడతానని ఆయన అన్నారు. ఇళయరాజా సుమధురమైన బాణీలను మోసుకొస్తోన్న 'రుద్రమదేవి' సినిమా కోసం, తెలుగులోని ఆయన సంగీతాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)