ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ అల్లుడితో మణిరత్నం

Fri, Apr 24, 2015
మణిరత్నం
మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకి చాలా కాలం తర్వాత విజయం లభించింది. ఇటీవల ఆయన నిత్యా మీనన్, దుల్ఖర్ సల్మాన్ జంటగా రూపొందించిన 'ఓకే కన్మణి' (తెలుగులో 'ఓకే బంగారం') చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. మంచి ప్రేమకథా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతున్నారు. దీంతో మంచి జోష్ మీదున్న ఈ దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో తమిళ స్టార్ ధనుష్ (రజనీకాంత్ అల్లుడు) కథానాయకుడుగా నటిస్తాడు. షరా మామూలుగా రెహ్మాన్ సంగీతం సమకూరుస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)