ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇబ్బందుల్లో ఉత్తమ విలన్!

Thu, Apr 23, 2015
ఉత్తమ విలన్ లో ఓ దృశ్యం
ఉత్తమ విలన్ లో ఓ దృశ్యం
వెండితెరపై ప్రయోగాలు చేయడంలోను ... పాత్రపరంగా వివిధ వేషధారణల్లో కనిపించడంలోను కమల్ హాసన్ ముందుంటాడు. అందువలన కమల్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. కథ .. కథనం .. వేషధారణ .. సాంకేతిక విలువలు .. ఇలా అన్నింటిలో ఆయన కొత్తదనాన్ని ఆవిష్కరిస్తుంటాడు. అలా ఓ విభిన్నమైన కథాంశంతో ఆయన తాజా చిత్రం 'ఉత్తమ విలన్' రూపొందింది. కమల్ హాసన్ విలక్షణమైన రెండు పాత్రలను ఈ సినిమాలో పోషించాడు.

రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అటు తమిళ్ లోను ... ఇటు తెలుగులోను మే 1న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తమ అభిమాన కథానాయకుడు కమల్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోందని అభిమానులు అనుకుంటూ వుండగా, ఆ తేదీన ఈ సినిమా విడుదల కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఇబ్బందుల నుంచి నిర్మాతలు బయటపడితేనే ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకి వస్తుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)