ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బ్రహ్మోత్సవంలోను అదే సెంటిమెంట్

Thu, Apr 23, 2015
రావు రమేష్
రావు రమేష్
తెలుగు తెరపై విరుగుడులేని విలనిజాన్ని పండించిన ప్రతినాయకులలో 'రావు గోపాలరావు' ఒకరు. విలన్ గా ఆయన విభిన్నమైన శైలిని ప్రేక్షకులు అంతతొందరగా మరిచిపోలేరు. ఆయన తరువాత ఆ లోటు ఎవరు పూడ్చగలరు? అనే సందేహానికి తానున్నాననే సమాధానమిస్తూ ఆయన కొడుకు 'రావు రమేష్' వెండితెరపైకి వచ్చాడు ... కళావారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.

తండ్రిలాగే పెద్దగా హడావిడి చేయకుండా విలనిజాన్ని పండించడం రావు రమేష్ ప్రత్యేకత. అయితే అందులో తండ్రిని అనుకరించడమనేది అస్సలు కనిపించకపోవడం విశేషం. తనదైన బాడీ లాంగ్వేజ్ ... డైలాగ్ డెలివరీతో ఆయన ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. ఈ ప్రత్యేకతతోనే ఆయన అనతికాలంలోనే మంచి గుర్తింపును పొందాడు. ఆయన వుంటే ఆ సినిమా హిట్టేనని అంతా అనుకునేలా చేశాడు. విలేజ్ లో వినాయకుడు .. పిల్ల జమీందార్ .. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు .. ముకుంద వంటి సినిమాలు ఈ విషయాన్ని నిజం చేశాయి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ..''మారండ్రా బాబూ ఇంకెన్నాళ్లిలా ఉండిపోతారు'' అంటూ వెటకారంగా ఆయన చెప్పిన డైలాగ్స్ ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడదే సెంటిమెంట్ తో శ్రీకాంత్ అడ్డాల ఆయనకి 'బ్రహ్మోత్సవం' చిత్రంలోను ఓ కీలకమైన పాత్రను ఇచ్చాడు. ఈ పాత్రకి కూడా ఆయన తనదైన శైలితో ప్రాణం పోస్తాడని ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత రావు రమేష్ మరింత బిజీ అవుతాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)