ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేట్ ఎగ్జయిట్ అవుతోంది

Mon, Apr 20, 2015
కత్రినా కైఫ్
కత్రినా కైఫ్
సినిమా, వాణిజ్య ప్రకటనల షూటింగులతో అందాల భామ కత్రినా కైఫ్ కొన్ని నెలల నుంచి తీరకలేకుండా బిజీగా ఉంటోంది. ఇప్పుడు వాటి నుంచి కాస్త విరామం తీసుకుంటూ అమ్మడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేయబోతోంది. ఈ ఫెస్టివల్లో తొలిసారి కేట్ రెడ్ కార్పెట్ పై నడవనుంది. అంతేకాదు, అందాల భామలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ లతో కలసి వాక్ చేయనుంది. దాంతో ఈ చిన్నది తెగ సంబరపడిపోతోంది.


"లోరియల్ పారిస్ తరఫున, భారత్ తరఫున ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా ఎగ్జైట్ గా ఉంది. ఈ ఫెస్టివల్లో లోరియల్ కు చెందిన ఇతర అంబాసిడర్లను కలుసుకునే అవకాశం వుంది. అందుకే, ఇక ఆగలేకపోతున్నాను" అంటోంది కత్రినా. అటు సోనమ్ కూడా కేట్ ను ఫెస్టివల్ కు ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేసింది. భారత్ లో లోరియల్ కు ఐష్, కత్రినా, సోనమ్ లు అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురు కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై సందడి చేయడం చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)