ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుడిపై నటి ఫిర్యాదు

Sun, Apr 19, 2015
సోనా
సోనా
సినిమా చేస్తామని చెప్పి అడ్వాన్సు తీసుకుని, తర్వాత సదరు నిర్మాతకు సినిమా చేయకుండా ఇబ్బంది పెట్టే దర్శకులకు చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని ప్రకటించింది తమిళ చిత్ర నిర్మాతల మండలి. ఆ వివరాల్లోకి వెళితే, శృంగారతారగా పేరు తెచ్చుకున్న సోనా ఆరేళ్ల క్రితం ఓ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా నిర్మించడం కోసం ఆయనకు కోటిన్నర రూపాయల అడ్వాన్సు ఇచ్చిందట.
అయితే, సదరు దర్శకుడు మాత్రం ఇంతవరకు ఆమెకు సినిమా చేయలేదు. దాంతో ఆమె ఆర్టిస్టుల సంఘానికి, నిర్మాతల మండలికి వెంకట్ ప్రభుపై ఫిర్యాదు చేసింది. తాజాగా సమావేశమైన ఈ రెండు సంఘాలు ఇద్దరినీ పిలిచి, కేసును పరిశీలించిన మీదట, మే నెలాఖరులోగా సోనాకు కోటి రూపాయలు చెల్లించాల్సిందిగా దర్శకుడు వెంకట్ ప్రభును ఆదేశించినట్టు కోలీవుడ్ సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)