ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిర్మాతగా మనోజ్ బాజ్ పాయ్

Sat, Apr 18, 2015
మనోజ్ బాజ్ పాయ్
మనోజ్ బాజ్ పాయ్
బాలీవుడ్ సినిమాలు చూసే వారికి మనోజ్ బాజ్ పాయ్ గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఆయన నటించిన ఏ సినిమా చూసినా పాత్ర మాత్రమే కనిపిస్తుంది. కెమెరా ముందు అంత సహజంగా నటించగలగడం ఆయన ప్రత్యేకత. అలా సహజనటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మనోజ్ బాజ్ పాయ్ నిర్మాతగా మారనున్నాడట. మనోజ్ బాజ్ పాయ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఆయన సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు.

సొంత బ్యానర్ పై ఆయన నిర్మించే మొదటి సినిమాగా ఒక థ్రిల్లర్ తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ముకుల్ అభ్యాంకర్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ తో పాటు టబూ నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ఆయన, తరువాత కూడా తన బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మితమవుతూ ఉంటాయని చెబుతున్నాడు. నటుడిగా విభిన్నమైన చిత్రాలలో ... విలక్షణమైన పాత్రలలో నటించి సక్సెస్ ను సాధించిన మనోజ్ బాజ్ పాయ్, నిర్మాతగా కూడా విజయాలు సాధించాలని ఆశిద్దాం.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)