ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుకన్య నిరీక్షణ ఫలించింది !

Sat, Apr 18, 2015
సుకన్య
సుకన్య
తమిళ్ తెరపై నిన్నటితరం కథానాయికలలో 'సుకన్య' పేరు ముందువరుసలో కనిపిస్తుంది. పెద్దరికం .. భారతీయుడు వంటి సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమే. అలాంటి సుకన్య పేరు ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. కొంతకాలం క్రితం సన్ టీవీ యాజమాన్యంపై ఆమె వేసిన కేసుకి సంబంధించి తీర్పు వెలువడటమే అందుకు కారణం.

ఒకప్పుడు స్మగ్లర్ వీరప్పన్ ని నక్కీరన్ పత్రికా సంపాదకుడు ఇంటర్వ్యూ చేశాడు. ఆ సమయంలో వీరప్పన్ .. సుకన్య గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అవి యథాతదంగా ఆ టీవీ ఛానల్లో ప్రసారమయ్యాయి. దాంతో ఆ ఛానల్ యాజమాన్యంపై మద్రాసు హైకోర్టులో సుకన్య పరువు నష్టం దావా వేసింది. కొంతకాలం క్రితం ఈ కేసు అక్కడి నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ట్రాన్స్ ఫర్ అయింది. వాదోపవాదాలు విన్న కోర్టు, సుకన్యకి పదిలక్షల అయిదువందల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని సన్ టీవీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)