ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేష్ బాబు స్పెషాలిటీ అదే !

Fri, Apr 17, 2015
రాహుల్ రవీంద్రన్
రాహుల్ రవీంద్రన్
ఫ్రెండ్స్ లో ఎవరైనా కాస్త అందంగా తయారైతే చాలు ... అబ్బా అచ్చు మహేష్ బాబులా ఉన్నాడ్రా! అని మిగతా వాళ్లు ఆటపట్టిస్తుంటారు. అంటే అందం విషయానికి వస్తే మహేష్ బాబును నిదర్శనంగా చూపుతూ వుండటం ఇక్కడ గమనించవలసిన విషయం. అలా తెలుగు తెరపై అందగాడుగా మహేష్ మార్కులు కొట్టేశాడు. అందంగా ఉండటమొక్కటే అర్హత కాదు .. యాక్టింగ్ తో అదరగొట్టాలి.

పాటల్లో హీరోయిన్ తో సున్నితంగా వ్యవహరిస్తూ రొమాంటిక్ ఫీల్ ని వర్కౌట్ చేసే మహేష్, యాక్షన్ సీన్స్ విషయానికి వచ్చేసరికి దుమ్మురేపేస్తాడు. సైలెంట్ గా డైలాగ్ చెబుతూ కామెడీని పండిస్తాడు. ఇక ఆయన సెంటిమెంట్ సీన్ చూస్తుంటే, ఆ సన్నివేశంలో మనం కూడా ఒక పాత్రగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా హాలీవుడ్ హీరోలా కనిపిస్తూ .. టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడాయన. మహేష్ సినిమాలు చూసే అభిమానులే కాదు .. ఆయనతో కలిసి నటించే ఆర్టిస్టులు కూడా ఆయనని అభిమానిస్తుంటారు.

వర్క్ విషయంలో ఆయన కనబరిచే అంకితభావాన్ని చూసి అభినందిస్తూ ఉంటారు. అలాంటివారి జాబితాలో తాజాగా రాహుల్ రవీంద్రన్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన 'శ్రీమంతుడు' సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ సమయంలో మహేష్ బాబు అంకితభావాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆయన, ఆ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తన పాత్ర విషయంలో మహేష్ శ్రద్ధ తీసుకునే తీరును అభినందించకుండా ఉండలేమని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)