ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ అలా డిసైడ్ అయ్యాడట !

Thu, Apr 16, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
తెలుగు తెరపై ఆయన కనిపిస్తేనే కాదు ... ఆయన పేరు వినిపించినా యూత్ ఊగిపోతూ వుంటుంది. ఆయన స్టైల్ ... డైలాగ్ డెలివరీని వాళ్లు అనుకరిస్తూ వుంటారు. ఇది పవన్ స్టైల్ అంటే చాలు దాన్ని ఎంతో ఇష్టంగా ఫాలోయైపోతుంటారు. ఆయన సినిమా విడుదలైన రోజే పండుగ అన్నట్టుగా ఆనందంతో పొంగిపోతుంటారు. అంతలా తనని యూత్ ఫాలో అవుతోంది కనుకనే, 'గబ్బర్ సింగ్ 2' సినిమాకి సంబంధించి తన పాత్ర విషయంలో ఆయన మార్పులు .. చేర్పులు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంతకు ముందు ఓ క్రేజ్ కలిగిన కథానాయకుడిగా ఆయన తెరపై సరదాగా సందడి చేశాడు. ఇప్పుడు ఆయన సమకాలీన రాజకీయాల్లోను చురుకైన పాత్రను పోషిస్తున్నాడు. బాధ్యతాయుతంగా తనదైన నినాదంతో ముందుకి వెళుతున్నాడు. అందువలన రాజకీయాల్లో తన ఇమేజ్ దెబ్బతినని విధంగా తన పాత్ర ఈ సినిమాలో ఉండేలా పవన్ శ్రద్ధ తీసుకున్నాడని అంటున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ ఒక కథానాయికగా కనిపించనుంది. త్వరలోనే ఈ కథని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ పాత్ర తీరు తెన్నులు ఎలాంటివో, అభిమానులకు ఆసక్తిని కలిగించేలా దానిని ఎలా మలిచారనే విషయం త్వరలోనే తెలియనుంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)