ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందుకే అలియా అంత కష్టపడుతోందట!

Thu, Apr 16, 2015
ఆలియా భట్
ఆలియా భట్
బాలీవుడ్ తెరపై పోటీపడుతోన్న కథానాయికలలో అలియాభట్ ముందువరుసలో కనిపిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను ... అభినయంతో అభినందనలు కొట్టేయడంలోను ఈ అమ్మడు ముందే వుంటుంది. అలియా ఇంతకుముందు చేసిన పాత్రలను పరిశీలిస్తే, అవకాశమనేది వదులుకుంటే తిరిగి వచ్చేది కాదని తెలిసినా, వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతను ఇస్తోందనే విషయం అర్థమైపోతుంది. తాజాగా ఈ నాజూకు సుందరి 'ఉడ్తా పంజాబ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విషయంలో తన అనుభవాలను ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె చెబుతోంది.

సాధారణంగా కథానాయికలు అనగానే, ఆకాశం వంటి వెండితెరపై చందమామలా కనిపిస్తే చాలని అనుకుంటారు. కథానాయకుడితో కలిసి ఆడిపాడుతూ ఆహ్లాదాన్ని అందిస్తే చాలనుకుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు ఫైట్స్ చేయవలసి వుంటుంది ... అలాగే క్రీడాకారిణి పాత్రను చేయవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాయికలు వాటిని నేర్చుకోవడానికి నానాకష్టాలు పడుతుంటారు. ప్రస్తుతం హాకీ నేర్చుకుంటూ తాను అలాంటి కష్టమే పడుతున్నానని చెబుతోంది అలియా. ఉడ్తా పంజాబ్ చిత్రంలో ఆమె హాకీ క్రీడాకారిణిగా నటిస్తోంది. అంతకుముందు ఈ ఆట చూడలేదు .. కానీ ఇప్పుడు కష్టపడి మరీ నేర్చుకోవలసి వస్తోంది అని అంటోంది. ఇంతవరకూ తాను చేసిన చిత్రాల్లో తాను ఎక్కువగా కష్టపడిన సినిమా ఇదేనని చెబుతోంది.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)