ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతారను ఇష్టపడుతున్న నటి!

Thu, Apr 16, 2015
జ్యోతిక
జ్యోతిక
ఏ భాషకి చెందిన చిత్రపరిశ్రమలోనైనా కథానాయికల మధ్య పోటీ అనేది తప్పనిసరిగా వుంటుంది. ఇక ఒకరికి దక్కవలసిన ఛాన్స్ పొరపాటున మరొకరికి వెళ్లిందంటే ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక వేళ ఛాన్స్ పోగొట్టుకున్న నాయిక పెద్దగా పట్టించుకోకపోతే, పట్టించుకునేలా చేసే వాళ్లకు కొదవేలేదు. ఎవరి అవకాశాలు వాళ్లకి ఉన్నప్పటికీ చెప్పుడు మాటల ప్రభావం కథానాయికల స్నేహానికి ఎసరు పెడుతూ వుంటుంది. ఇక ఎలాంటి సందర్భంలో కూడా కొంతమంది కథానాయికలు తమ సమకాలీన కథానాయికలలోని టాలెంట్ ని గురించి ప్రస్తావించరు. ఎందుకంటే అవకాశాలు అటువైపు పరిగెడతాయని భయపడుతుంటారు. ఆ స్థాయిని దాటిపోయిన తరువాత అవతలి వారి గొప్పతనాన్ని అంగీకరించాలన్నా కొందరికి మనసు అంగీకరించదు. అలాంటివారికి దూరంగా 'జ్యోతిక' కనిపిస్తుంది. అందుకు నిదర్శనం, తాజాగా ఆమె నయనతారను ప్రశంసించడమే!


తమిళ తెరపై ఇద్దరూ మంచి గుర్తింపును పొందిన వారే. జ్యోతిక పెళ్లిచేసుకుని ఇల్లాలి పాత్రను పోషిస్తూ వుంటే, నయనతార అదే క్రేజ్ తో ముందుకు దూసుకు వెళుతోంది. తిరిగి ఇప్పుడిప్పుడే సినిమాలపై దృష్టి పెడుతోన్న జ్యోతిక .. తనకి ఇష్టమైన కథానాయిక 'నయనతార' అంటూ చెప్పుకొచ్చింది. నయనతార చాలా మంచి నటి అనీ ... ఆమె సినిమాలను థియేటర్ కి వెళ్లి తప్పకుండా చూస్తూ ఉంటానని అంటోంది. ఆమె ఇలా నయనతారను అభినందించడానికి కారణం, వాళ్లిద్దరి మధ్యగల స్నేహమేనని చెప్పుకోక తప్పదు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)