ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందాలతార వ్యవహారం అలాంటింది!

Sun, Apr 12, 2015
అందాలతార
అందాలతార
ఎక్కడ ఎలా మసలుకోవాలో నయనతారకు బాగా తెలుసు, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో! అందుకే, పారితోషికం విషయంలో ఒక్కోసారి ఒక్కోలా ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు తీసుకుంటోంది. తాజాగా నటించిన 'నన్బెండ' చిత్రానికైతే ఉదయనిధి స్టాలిన్ ఆమెకు రెండున్నర కోట్లు ఇచ్చాడట. అదే నయన ప్రస్తుతం తన మాతృభాష మలయాళంలో మమ్ముట్టితో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇందుకుగాను కేవలం 50 లక్షలు మాత్రమే తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆభరణాల సంస్థ అమ్మడిని తమ బ్రాండ్ ప్రచారం కోసం ఓ కమర్షియల్ లో నటించమని అడిగితే, రెండు రోజుల ఆ షూటింగుకు గాను 4 కోట్లు డిమాండ్ చేసిందట. అదీ ఈ ముద్దుగుమ్మ బిజినెస్ వ్యవహారం!
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)