ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కోలీవుడ్ తెరపై ఆస్ట్రేలియా భామ

Sat, Apr 11, 2015
ప్రశాంత్
ప్రశాంత్
సినిమాకి కావలసినది కొత్తతరమే .. కొత్తదనమే. అదే సినిమాకి గల ప్రధానమైన ఆకర్షణగా చెబుతుంటారు. ఇక సినిమాకి కొత్తదనమనేది ... అసలైన ఆకర్షణ అనేది కథానాయిక నుంచే మొదలవుతూ వుంటుంది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ లో హీరో దుమ్మురేపేస్తూ వుంటే, అటు కథానాయకుడికీ .. ఇటు ఆడియన్స్ కి కాస్తంత రిలీఫ్ ని ఇచ్చేది కథానాయికే. అందువల్లనే కథానాయిక ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. విదేశీ ముద్దుగుమ్మలను సైతం తెరపైకి తీసుకువస్తుంటారు. అలా కొత్త కథానాయికలను పరిచయం చేయడంలో కోలీవుడ్ కాస్త దూకుడు మీదే వుంది.

తాజాగా ప్రశాంత్ కథానాయకుడిగా చేస్తోన్న 'సాహసం' సినిమాలో ఆస్ట్రేలియాకి చెందిన అమ్మాయి 'అమండా' కథానాయిక కావడమే ఇందుకు నిదర్శనం. చిత్రనేపథ్యం పరంగా .. పాత్రపరంగా ఈ సినిమాలో కథానాయికకి కొన్ని ప్రత్యేకతలు అవసరమయ్యాయనీ .. ఆ లక్షణాలు 'అమండా'లో కనిపించడం వలన ఆమెని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో ... భారీ తారాగణంతో రూపొందిస్తోన్న ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకుని త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)