ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దశరథ్ కథానాయకుడు మనోజ్

Fri, Apr 10, 2015
మనోజ్
మనోజ్
దర్శకుడు దశరథ్ పేరు వినగానే అందరికీ గుర్తుకువచ్చే సినిమా 'సంతోషం'. ఆ తరువాత ఆయన విజయాల జాబితాలో చేరిన మరో సినిమాగా 'మిస్టర్ పర్ఫెక్ట్' కనిపిస్తుంది. కుటుంబాలు ... బంధాలు ... అనుబంధాల నేపథ్యంలో ఆయన సినిమాలు ఉంటాయనడానికి నిదర్శనంగా ఈ రెండు సినిమాలను చెప్పుకోవచ్చు. తెరపై ఎలాంటి హడావిడి చేయకుండా హాయిగా ... ఆనందంగా ఆయన కథలు సాగిపోతూ వుంటాయి. కథకి తగినట్టుగానే ఆహ్లాదకరమైన పాటలు అలా పలకరించి వెళుతుంటాయి.

అలాంటి ఫీల్ గుడ్ మూవీస్ ని తెరకెక్కిస్తూ వచ్చిన దశరథ్, త్వరలో మంచు మనోజ్ కథానాయకుడిగా ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతవరకూ దూకుడు మీదుండే పాత్రలనే మనోజ్ ఎక్కువగా చేస్తూ వచ్చాడు. మాస్ ఆడియన్స్ మనసు దోచుకునే విధంగానే ఆయన సినిమాలు వుంటాయి. అలాంటిది వీళ్ల కాంబినేషన్ లో సినిమా రానుందనే వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకూ భిన్నమైన దారుల్లో ప్రయాణం చేస్తూ వచ్చిన దశరథ్ .. మనోజ్ ఎలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారనే విషయంలో త్వరలో స్పష్టత రానుంది. అన్నట్టు త్వరలోనే మనోజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పెళ్లిసందడి తరువాతనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)