ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిక్కుల్లో పడ్డ చిన్నది!

Fri, Apr 03, 2015
అసిన్
అసిన్
కేరళ బేబీ అసిన్ ఇప్పుడు 'ఎరక్కపోయి వచ్చాను ... ఇరుక్కుపోయాను' అనే పాట పాడుకునే సమయం ఆసన్నమైంది. తనకు మాలిన పనిలో జోక్యం చేసుకుంటే తలనొప్పులు తప్పవన్న విషయం అమ్మడికి అవగతమైంది. ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో ఇండియా పరాజయం పాలైన సందర్భంలో విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔటైన తీరుపై అభిమానులు అతని ప్రియురాలు అనుష్క శర్మపై నోరు పారేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

దీంతో, 'ఈ విషయంలో అనుష్క తప్పేముంది?' అంటూ అసిన్ ఆమెకు బాసటగా నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులు అనుష్కను వదిలేసి, అసిన్ పై పడ్డారు. ఆమె పేరిట నకిలీ అకౌంటును ప్రారంభించి రకరకాలుగా ట్వీటులు వదులుతున్నారు. విషయం కాస్తా అసిన్ దృష్టికి వెళ్ళడంతో అమ్మడు తలపట్టుకుని పోలీసులను ఆశ్రయించే ఆలోచన చేస్తోందట.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)