ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాయుడుగారి పేరిట అవార్డు

Thu, Apr 02, 2015
రామానాయుడు
రామానాయుడు
ఇటీవల దివంగతులైన ప్రముఖ నిర్మాత, మూవీ మొగల్ డి.రామానాయుడి జ్ఞాపకార్థం ప్రతి ఏటా భారీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన తనయులు సురేష్ బాబు, వెంకటేష్ కలసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఆయన తనయులు నెలకొల్పిన 'ఏఎన్నార్ ఇంటర్నేషనల్ అవార్డు' రీతిలో జాతీయ స్థాయిలో చిత్ర ప్రముఖులకు ప్రతి ఏటా ఒక అవార్డును ప్రదానం చేసే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామానాయుడి జన్మదినమైన జూన్ 6న సురేష్ బాబు వెల్లడిస్తారు. కాగా, దివంగత నాయుడి చితాభస్మాన్ని పవిత్ర అలహాబాద్, కాశీ, రిషికేశ్ లోని గంగా నదిలోనూ, ఇతర ప్రముఖ నదులలోనూ కలిపి ఇటీవలే సురేష్ బాబు హైదరాబాదుకు చేరుకున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)