ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుమలతను హెచ్చరించిన నటి!

Mon, Mar 30, 2015
సుమలత
సుమలత
తన పెళ్లి గురించి చెప్పగానే సుహాసిని తనను హెచ్చరించిందని అంటోంది ఒకప్పటి ప్రముఖ కథానాయిక సుమలత. ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ ను సుమలత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. ఆయనను చేసుకోవాలని నిశ్చయించుకున్నాక తన స్నేహితురాలు, మరో నటి సుహాసినికి విషయం చెప్పిందట. దాంతో, 'అంబరీష్ తో జాగ్రత్తగా ఉండు' అని సుహాసిని తనను హెచ్చరించిందని ఇప్పుడు బయటపెట్టింది సుమలత. అలాగే, తన మేకప్ మేన్ కూడా ఈ విషయంలో హెచ్చరించాడని చెప్పింది. వీరంతా తన మేలు కోరే అలా చెప్పారనీ, అయితే, తాను ఆయనను ప్రేమించడంతో ధైర్యంగా పెళ్లాడానని, ఇంతవరకు తమ సంసారం సాఫీగానే సాగిపోతోందనీ, ఎలాంటి సమస్యలూ లేవని సుమలత చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)