ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కత్రినా బొమ్మ కాస్ట్ లీ గురూ!

Sun, Mar 29, 2015
కత్రినా  మైనపు బొమ్మ
కత్రినా మైనపు బొమ్మ
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ మైనపు బొమ్మ లండన్ లోని ప్రసిద్ధ 'మేడం టుస్సాడ్స్' మ్యూజియంలో కొలువుదీరింది. దీంతో అమితాబ్, షారుఖ్, సల్మాన్, మాధురి, కరీనా వంటి తారల సరసన ఆమె బొమ్మ కూడా చేరింది. ఈ మైనపు బొమ్మను తయారు చేయించడానికి మ్యూజియం నిర్వాహకులకు ఒక కోటీ నలభై లక్షల రూపాయల వ్యయం అయిందట.

దీనికి ముందుగా జరిగిన ప్రక్రియలో, అసలు మ్యూజియంలో ఈ ఏడాది ఎవరి బొమ్మ పెట్టాలన్న పోలింగులో కత్రినాకు భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయట. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే ... ఈ ముగ్గురిలోనూ ఒకరి ఎంపిక కోసం టుస్సాడ్స్ సంస్థ తన వెబ్ సైట్ ద్వారా పోలింగ్ నిర్వహించింది. ఇందులో కత్రినా 2 లక్షల 25 వేల ఓట్లు సొంతం చేసుకుని విజేతగా నిలవడంతో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)