ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజాపై 'రుద్రమ' ముద్ర!

Tue, Mar 24, 2015
ఇళయరాజా
ఇళయరాజా
ఇళయరాజా మామూలుగా ఏ సినిమాకైనా రీరికార్డింగ్ చేయాలంటే జస్ట్ మూడు రోజుల్లో పూర్తి చేసేస్తారు. ఒక్కసారి ఆయన కూర్చున్నారంటే ఆ ప్రవాహం అలా సాగిపోతుంది. అయితే, అనుష్క నటించిన 'రుద్రమదేవి' చిత్రానికి మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికే మూడు రోజుల సమయాన్ని తీసుకున్నారట! గుణశేఖర్ తీసిన విజువల్స్ కి ఆయన అబ్బురపడిపోతున్నారని అంటున్నారు. అందుకే, తన పరంగా రీరికార్డింగ్ అద్భుతంగా వుండడం కోసం ప్రస్తుతం మహాబలిపురం వెళ్లి ఆర్.ఆర్ (రీరికార్డింగ్) నోట్స్ రాసుకుంటున్నారని ఇళయరాజా సన్నిహితులు చెబుతున్నారు. ఇక, రీరికార్డింగును లండన్ లో చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారట!
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)