ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జల్సారాయుడితో జరీనా!

Mon, Mar 23, 2015
జరీనా
జరీనా
బాలీవుడ్ కి సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన జరీనా ఖాన్ (కత్రినా కైఫ్ పోలికలతో వుంటుంది) తొలిసారిగా తెలుగు చిత్రంలో నటిస్తోంది. శ్రీకాంత్ నటించే 'జల్సారాయుడు' సినిమాలో ఆమె కథానాయికగా నటించనుంది. సుధీర్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దీని గురించి దర్శకుడు చెబుతూ, "అవును, జరీనా ఖాన్ నటించిన సినిమాలు చూశాను. ఆమె ఈ పాత్రకి బాగా సూటవుతుందనిపించి ఆమెను కాంటాక్ట్ చేశాం. ఈ సినిమా చేయడానికి ఆమె సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇక మేమడిగిన డేట్స్ కేటాయించి, సంతకం చేయడమే తరువాయి" అన్నారు. ఎస్తేర్, ప్రాచీ సిన్హా కూడా ఇందులో ఇతర కథానాయికలుగా నటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)