ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రి చివాట్లు పెడతాడట

Sat, Mar 14, 2015
ఐశ్వర్య
ఐశ్వర్య
'పట్టాత్తు యానై' తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఐశ్వర్య ప్రస్తుతం కథక్ డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఈమె ఒకప్పుడు యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న సీనియర్ నటుడు అర్జున్ కూతురన్న సంగతి మనకు తెలిసిందే. తొలిచిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు తండ్రి దర్శకత్వంలో నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర నాట్యం ప్రధానంగా సాగుతుంది. దాంతో ఇందుకోసం కథక్ నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తోందట.

"నాకు క్లాసికల్ డ్యాన్స్ వచ్చు. అయితే, కథక్ రాదు. అందుకే నేర్చుకుంటున్నాను. సెట్స్ లో ఏదైనా తప్పుగా చేస్తే నాన్న చివాట్లు పెడతారు. అందుకే, పెర్ఫెక్ట్ గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తున్నాను" అంటోంది ఐశ్వర్య. తండ్రి దర్శకత్వంలో నటించడం ఇబ్బంది కాదా? అంటే, " ఇబ్బందీ వుంది. సౌకర్యమూ వుంది. అయితే, తండ్రీ కూతుళ్లమన్న బంధం ఇంటి వరకే. సెట్లోకి వచ్చాక ఆయన డైరెక్టర్, నేను హీరోయిన్ ... అంతే!" అంటూ నవ్వేసింది ఈ కథానాయిక.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)