ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మోసగాళ్లకు మోసగాడు' ఫస్ట్ లుక్

Thu, Mar 05, 2015
1971లో హీరో కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' టైటిల్ తో చేసిన సినిమా టాలీవుడ్ లో అప్పట్లో ఓ సంచలనం. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ అదే టైటిల్ తో హీరో కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. 'స్వామి రారా' సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్కును కృష్ణ, విజయనిర్మల దంపతులు ఈ రోజు హైదరాబాదులో సంయుక్తంగా రిలీజ్ చేశారు. తాను నటించిన 'మోసగాళ్లకు మోసగాడు'లానే ఇది కూడా సూపర్ హిట్టవ్వాలని హీరో కృష్ణ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇందులో సుధీర్ బాబు, నందిత జంటగా నటించారు. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)