ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇక నిర్మాతగా పవన్ కల్యాణ్!

Sun, Mar 01, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
తాను చిత్ర నిర్మాణ రంగంలోకి దిగుతున్నట్టుగా పవన్ కల్యాణ్ మళ్లీ ప్రకటించాడు. 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తానంటూ గతంలో ఆయన ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడీ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తన పెద్దన్నయ్య తనయుడు రామ్ చరణ్ హీరోగా తన బ్యానర్ పై ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదే కాకుండా, ఇంకా మిగిలిన యంగ్ హీరోలతో కూడా చిత్రాలు నిర్మిస్తామనీ, కొత్త టాలెంటును పరిచయం చేసే క్రమంలో నూతన దర్శకులతో కూడా చిత్రాలు నిర్మిస్తామనీ 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, చరణ్ తో నిర్మించే చిత్రం వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)