ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాళ్లంతా మళ్లీ కలిశారు!

Mon, Feb 23, 2015
నాటి కలయికకు గుర్తుగా...
నాటి కలయికకు గుర్తుగా...
1980లలో దక్షిణాది చిత్రాలలో ఓ ఊపి ఊపిన తారలంతా '80s రీయూనియన్' పేరిట ఏడాదికోసారి ఒకచోట కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు '90s రీయూనియన్' పేరిట కొందరు తాజాగా సమావేశమయ్యారు. ప్రముఖ తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ నేతృత్వంలో వీరంతా చెన్నయ్ లోని ఈ దర్శకుడి ఇంట్లో సమావేశం జరిపారు.


90 వ దశకంలో తమిళంలో రాణించిన తారలే కాకుండా, సాంకేతిక నిపుణులు కూడా ఈ గ్రూపులో చేరారు. హీరోలు విజయ్, సూర్య, అరవింద్ స్వామి, దర్శకుడు శంకర్, సుందర్ సి, రోజా, మీనా, సిమ్రాన్, జ్యోతిక, సంగీత, ఎ.ఆర్. రెహ్మాన్ తదితరులంతా హాజరయ్యారు. వైట్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నామని, అయితే, రెహ్మాన్ కి చివరి క్షణంలో చెప్పడం వల్ల ఆయన మామూలు డ్రెస్ లో వచ్చారని రవికుమార్ చెప్పారు. పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుని సరదాగా గడిపామని ఆయన అన్నారు. ఈసారి మరింత మంది హాజరవుతారని ఆయన అన్నారు. ఆనాటి కలయికకు గుర్తుగా పెద్ద కేక్ ను కూడా కట్ చేశారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)