ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ రొమాన్స్ బాటలో వర్మ

Mon, Feb 16, 2015
గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మ సినిమాల్లో ఎక్కడ చూసినా ఫ్యాక్షన్, గ్యాంగ్ స్టర్ కథలే కనిపిస్తున్నాయి. అయితే, వీటికి కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ ఆయన రొమాన్స్ బాట పట్టాడు. '365 డేస్' అనే చిత్రాన్ని గతంలో తాను తీసిన 'రంగీలా' సినిమా టైపులో తీస్తున్నాడు. ఇందులో నందు, అనైక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల ఒక రొమాంటిక్ సాంగును ఐదు రోజుల పాటు శృంగారాత్మకంగా షూట్ చేశాడు వర్మ. దీనికి 35 లక్షలు ఖర్చయినట్టు హీరో నందు చెబుతున్నాడు. ఒక జంట జీవితంలో 365 రోజుల్లో జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వర్మ. దీని తర్వాత మళ్లీ వరుసగా ఆయన రొమాంటిక్ సినిమాలు తీస్తాడేమో చూద్దాం.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)