ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

షారుఖ్ 'చల్తీ కా నామ్ గాడీ'

Wed, Feb 11, 2015
కాజోల్, షారుఖ్
కాజోల్, షారుఖ్
'చెన్నై ఎక్స్ ప్రెస్' విజయం తరువాత షారుఖ్ ఖాన్, రోహిత్ శెట్టి కలసి మరో ప్రాజెక్టు చేయబోతున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నారన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. హిందీలో 1958లో విడుదలైన 'చల్తీ కా నామ్ గాడీ' అనే హాస్య చిత్రం ఆధారంగా దీనిని చేస్తున్నారట. అయితే రోహిత్ శైలిలోనే సినిమా ఉంటుందంటున్నారు. "చల్తీ కా నామ్ గాడీ', 'హమ్' చిత్రాల స్పూర్తితో ఇది రూపొందనుంది. ఇందులో షారుఖ్ పాత్ర 'చల్తీ కా నామ్'లో అశోక్ కుమార్ లా, 'హమ్'లో అమితాబ్ బచ్చన్ ల కలయికగా ఉంటుంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇందులో కింగ్ ఖాన్ సోదరుడిగా కనిపించనున్నాడు. 'చల్తీ కా నామ్'లో కిశోర్ కుమార్ కి ఉన్నట్టుగా ఇందులో వరుణ్ కు కృతి సనన్ లవ్ ఇంట్రస్ట్ గా కనిపిస్తుంది" అని వెల్లడించారు దర్శకుడి సన్నిహితులు. ఇందులో షారుఖ్ సరసన కాజోల్ ను అడిగారని, ఇంకా ఆమె ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి మొదలవుతుంది. డిసెంబర్ లో క్రిస్మస్ కు విడుదలయ్యే అవకాశం ఉంది.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)