ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెహ్మాన్ ఇంప్రెస్ అయ్యాడట

Tue, Feb 10, 2015
ఏఆర్ రెహ్మాన్
ఏఆర్ రెహ్మాన్
పలానా చిత్రంలో పలానా హీరో నటిస్తున్నాడంటూ గొప్పగా ఎలా అయితే చెప్పుకుంటారో, పలానా చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నాడంటూ కూడా చెప్పుకుంటారు. అంటే, రెహ్మాన్ మ్యూజిక్ చేయడానికి ఒప్పుకోవడం అంటే మాటలు కాదు. పారితోషికం మాట అటుంచినా, అతనికి సినిమా కథ, యూనిట్ నచ్చాలి. అప్పుడే ఒప్పుకుంటాడు. ఇప్పుడు తాజాగా తమిళ హీరో సూర్యా చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోవడం విశేషం.

'మనం' ఫేం విక్రంకుమార్ దర్శకత్వంలో సూర్యా హీరోగా ఓ సినిమా రూపొందనుంది. దీనికి నిర్మాత కూడా సూర్యానే. ఈ దర్శకుడు మూడు గంటల పాటు చెప్పిన కథ విన్న రెహ్మాన్ మ్యూజిక్ ఇవ్వడానికి వెంటనే ఓకే చెప్పేశాడట. అప్పుడే ఓ బాణీ కూడా కట్టేశాడని అంటున్నారు. రెహ్మాన్ మ్యూజిక్ తమ సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)