ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ దర్శకుడికి ఫాదర్ కావాలట!

Mon, Feb 09, 2015
సుకుమార్
సుకుమార్
దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోసం వెతుకుతున్నాడు. ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నెలలోనే దీని షూటింగ్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చాలా శక్తిమంతమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ తండ్రీకొడుకుల మధ్య నువ్వా? నేనా? అన్న రీతిలో సాగే సీన్స్ వున్నాయట. ఇలాంటి పాత్రలు పోషించడానికి జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లాంటి నటులు మనకు ఉన్నప్పటికీ, కొత్తదనం కోసం బాలీవుడ్ నటుని కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)