ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిన్న పాత్ర... పెద్ద తృప్తి!

Thu, Feb 05, 2015
అడవి శేష్
అడవి శేష్
'చిన్న పాత్రే అయినా పెద్ద తృప్తినిచ్చిన పాత్ర చేశా'నంటున్నాడు యువ నటుడు అడవి శేష్. ఓపక్క హీరోగా చేస్తూ మరో పక్క చిన్న పాత్ర చేయాల్సిన అవసరం ఈ నటుడుకి ఏమొచ్చింది? అంటే, "జస్ట్ రాజమౌళి గారి సినిమా కాబట్టి" అంటూ సమాధానం కూడా తనే చెప్పాడు. "బాహుబలి లాంటి ఎపిక్ లో చిన్న పాత్రయినా చేయాలనుకున్నాను. అందుకే, రాజమౌళి గారిని పరిచయం చేయమని నిర్మాత శోభుగారిని అడిగాను. అలా ఆయన ద్వారా సార్ ని కలసి, 'మీ సినిమాలో చిన్న పాత్రయినా సరే ఇవ్వండి సార్' అని రిక్వెస్ట్ చేశాను. అప్పుడాయన ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఆయన నన్ను మరచిపోయి వుంటారనుకున్నాను. అయితే, కొన్ని నెలల తర్వాత ఫోన్ చేసి, ఒక ఇంపార్టెంట్ ప్రిన్స్ క్యారెక్టర్ వుంది చేస్తావా? అనడిగారు. ఎగిరిగంతేసి, థాంక్స్ చెప్పాను. అలా 'బాహుబలి' పరివారంలో నేను కూడా చేరాను" అని వివరించాడు శేష్.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)