ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేరళలో 'మెగా' చర్చలు

Mon, Feb 02, 2015
చిరంజీవి
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం కేరళలో జరుగుతున్నాయి. గత కొన్నాళ్లుగా చిరంజీవి అక్కడ 'స్పా' థెరఫీ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన విపరీతంగా బరువు పెరిగిపోవడంతో, దానిని తగ్గించుకుని, మళ్లీ కొత్త లుక్కుతో రావడం కోసం ఆయన అక్కడి 'స్పా'లో డైటింగుతో కూడిన ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారట. దీంతో ఈ సినిమాకి రచన చేస్తున్న పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ కూడా ప్రస్తుతం అక్కడే వుండి, ఆయనతో కథా చర్చలు జరుపుతున్నట్టు చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి వీవీ వినాయక్ దర్శకుడు కాగా, తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)