ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కథానాయికగా హీరోయిన్ కూతురు

Wed, Jan 28, 2015
తల్లితో సుబ్బులక్ష్మి
తల్లితో సుబ్బులక్ష్మి
ఇటీవలి కాలంలో హీరోల కొడుకులే కాదు, హీరోయిన్ల కూతుళ్లు కూడా తమ తల్లిదండ్రులకు వారసులుగా వెండితెరకు వస్తున్నారు. వీరిలో కొందరు బాగా సక్సెస్ అయిన వాళ్లు కూడా వున్నారు. ఈ కోవలో ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూతురు త్వరలో రంగ ప్రవేశం చేయనుంది. నిన్నటితరం ప్రముఖ నాయిక గౌతమి కూతురు సుబ్బులక్ష్మి కూడా నటన పట్ల ఆసక్తి చూపుతోందట. అది గ్రహించిన తల్లి ఆమెకు ప్రస్తుతం నాట్యంలో ట్రైనింగు ఇప్పిస్తోంది.

అలాగే, తను వెళ్లే ఫంక్షన్లకు కూతుర్ని తన వెంట తీసుకువెళుతూ ఆమెను నలుగురికీ పరిచయం చేస్తోంది. దీంతో కొందరు తమిళ దర్శక నిర్మాతలు ఆమెను కథానాయికగా పరిచయం చేస్తామంటూ ముందుకువస్తున్నారట. అయితే, తన కూతురి సినిమా ఎంట్రీ గురించి గౌతమి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బులక్ష్మి పదహారేళ్ల వయసులో ప్రవేశించింది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)