ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగార్జునకు 'నో' చెప్పిందట!

Tue, Jan 27, 2015
స్వాతి
స్వాతి
నాగార్జున సరసన నటించే అవకాశాన్ని కలర్స్ స్వాతి చేజార్చుకుంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ అక్కినేని హీరో తాజాగా 'సోగ్గాడే చిన్ని నాయన' అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తాత, మనవడు పాత్రల్లో డ్యూయల్ రోల్ లో ఆయన కనిపిస్తారు. తాత పాత్ర పక్కన రమ్యకృష్ణ నటిస్తోంది. ఇక మనవడి పాత్రకు స్వాతిని అడిగారట. ఆమెకు కూడా చేయాలని ఉండడంతో ఓకే చెప్పింది. అయితే, డేట్స్ విషయానికి వచ్చేసరికి క్లాష్ రావడంతో సారీ చెప్పిందట. ప్రస్తుతం తను తమిళ, మలయాళ సినిమాలలో బిజీగా వుంది. దాంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదు. ఇలా ఈ ముద్దుగుమ్మ వదిలేయడంతో, ఆ అవకాశం హాట్ యాంకర్ అనసూయను వరించింది!
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)