ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ భామ కావాలట!

Sat, Jan 24, 2015
సోనాక్షి-దీపిక
సోనాక్షి-దీపిక
తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఇప్పుడు బాలీవుడ్ భామలపై మనసు పారేసుకున్నాడు. తన తదుపరి చిత్రానికి బాలీవుడ్ కథానాయికను బుక్ చేయమని నిర్మాతలకు చెప్పాడట. ప్రస్తుతం 'పులి' సినిమాలో నటిస్తున్న ఈ హీరో దీని తర్వాత అట్లీకుమార్ దర్శకత్వంలో తన 59వ చిత్రాన్ని చేయాల్సివుంది. ఇందులో మొదట్లో నయనతార కోసం ట్రై చేశారు. అయితే, అమ్మడు వీరడిగిన డేట్స్ ఖాళీ లేవని చెప్పడంతో, కాస్త ఎక్కువ ఖర్చయినా ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మనే తీసుకోమని విజయ్ సలహా ఇచ్చాడట. దాంతో దీపిక పదుకొనె లేదా సోనాక్షి సిన్హా కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారట. సో, నయన్ ఒప్పుకోకపోవడం వల్ల నిర్మాతకు ఇలా కోట్లు వదులుతున్నాయి!
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)