ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఝలక్ ఇస్తున్న అందాలసుందరి

Fri, Jan 16, 2015
ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్
నలభైల్లో కూడా వన్నె తరగని అందంతో తళుకులీనుతున్న మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ తల్లిగా మారాక వెండితెర నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి విదితమే. కూతురు కాస్త పెద్దవడంతో ఇక ఇప్పుడు ఒక్కసారిగా స్పీడు పెంచేసింది. ఒకేసారి ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటోంది. సంజయ్ గుప్తా రూపొందిస్తున్న 'జాజ్బా' చిత్రంతో తిరిగి సెట్స్ లోకి వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం అవుతోంది. అలాగే కరణ్ జొహార్ దర్శకత్వం వహించే 'ఏయీ దిల్ హై ముస్కిల్' చిత్రానికి కూడా ఓకే చెప్పేసింది. ఇవి కాకుండా మరో నాలుగు ప్రాజక్టులకు కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి. ఈ విధంగా ఒక్కసారిగా మిగతా హీరోయిన్లకు ఝలక్ ఇవ్వాలన్నది ఐష్ ఆలోచనలా వుంది.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)