ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ మరో రెండు సినిమాలు!

Fri, Jan 16, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
'గోపాల గోపాల' సినిమాతో ప్రేక్షకులను మరోసారి అలరిస్తున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ కానున్నాడు. ప్రస్తుతం 'గబ్బర్ సింగ్ 2' చిత్రం షూటింగును ప్రారంభించనున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం స్క్రిప్టు ఇప్పటికే సిద్ధంగా వుంది. ఇక సెట్సుకి వెళ్లడమే తరువాయి! ఇదిలా ఉంచితే, ఇది కాకుండా తాను మరో రెండు చిత్రాలు చేయనున్నట్టు పవన్ తాజాగా ప్రకటించాడు. "గబ్బర్ సింగ్ 2 తర్వాత మరో రెండు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రెండూ కూడా ప్రస్తుతం చర్చల దశలోనే వున్నాయి. కథలు కూడా సిద్ధం కాలేదు" అని చెప్పాడు. కాగా, వీటిలో ఒక చిత్రానికి 'గోపాల గోపాల' ఫేం డాలీ, మరో చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని అనధికారిక సమాచారం.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)