ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కల్యాణ్ కు 'పద్మభూషణ్'!

Thu, Jan 15, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
తెలుగునాట విశేష ప్రజాదరణ పొందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పద్మభూషణ్ పురస్కారం లభించనున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ కు పవన్ ఎంపిక ఖరారైందని ఢిల్లీ నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ సినీ నటుడిగానే కాక, ఇటీవల రాజకీయంగా కూడా చురుకుగా ఉంటూ ప్రజాసేవలోకి ఉరికిన సంగతి విదితమే. తాను 'జనసేన' పార్టీని నెలకొల్పినప్పటికీ, గత ఎన్నికల్లో నరేంద్రమోదీ తరఫున తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి భారీగా ప్రచారం చేశాడు. ఆ సమయంలోనే మోదీతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. పవన్ చరిష్మాను వివిధ బహిరంగ సభలలో ప్రత్యక్షంగా తిలకించిన మోదీ, ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించాలని ప్రధాని దాదాపు నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది!
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)