ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మెగా హీరో కొత్త ప్రాజక్టులు

Mon, Dec 22, 2014
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
'ముకుంద' సినిమాతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగా ఫ్యామిలీ కొత్త హీరో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికి రెండు చిత్రాలను అంగీకరించినట్టు వరుణ్ మీడియాకు తెలిపాడు. 'ముకుంద' తర్వాత వెంటనే చేసే చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పాడు. అసలు 'హార్ట్ ఎటాక్' చిత్రాన్ని తన తొలి చిత్రంగా పూరీతో చేయాల్సివుందనీ, కథ నచ్చినా వేరే కారణాల వల్ల అది వద్దనుకున్నామనీ చెప్పాడు. అందుకే, ఇప్పుడు పూరీతో చేస్తున్నానని అన్నాడు. అలాగే, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అంగీకరించానని వరుణ్ చెప్పాడు. ఈ రెండు ప్రాజక్టులు వచ్చే ఏడాది సెట్స్ కి వెళతాయి.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)