ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మల్లూ బ్యూటీకి కోర్టు షాక్

Sun, Dec 21, 2014
అమలాపాల్
అమలాపాల్
భర్తతో కలసి కెనడా, అమెరికా దేశాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి రెడీ అవుతున్న మల్లూ బేబీ అమలాపాల్ కి కోర్టు చిన్న షాక్ ఇచ్చింది. ఇతర సంస్థల ఆభరణాలకు సంబంధించిన ప్రచార ప్రకటనలలో ఆమె నటించకూడదంటూ ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది. కొచ్చీకి చెందిన ఓ జ్యూయలరీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో అమలాకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలో తాము 30 లక్షలు అమలాకు చెల్లించి తమ సంస్థ తరఫున ప్రచారకర్తగా కాంట్రాక్టు చేసుకున్నామనీ, అది పూర్తయ్యేలోగా మరే ఇతర జ్యూయలరీ సంస్థకు తాను పనిచేయకూడదనీ, అయితే ఈ కాంట్రాక్టును ధిక్కరించి మరో సంస్థకు ప్రచారం చేయడానికి అమల ఒప్పుకుందనీ, దానిని నిలుపుదల చేయాలనీ సదరు సంస్థ కోర్టుకి ఎక్కింది. ఈ విషయంలో అమలా పాల్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది!
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)