ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కి హీరోయిన్ కావాలి

Tue, Dec 16, 2014
అలియా
అలియా
అఖిల్ అక్కినేని నటించే చిత్రానికి కథానాయిక ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే అఖిల్ కి స్టార్ ఇమేజ్ వచ్చేయడంతో తను నటించే మొదటి సినిమాకి ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. దానికి తోడు దీనికి వీవీ వినాయక్ దర్శకుడు కావడం మరింత క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అఖిల్ సరసన కథానాయికగా పలువురు భామలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో వున్న హీరోయిన్లంతా అతనికంటే పెద్ద వాళ్లు కావడంతో ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ అలియా భట్ కోసం తీవ్రంగా ట్రై చేశారు. కానీ, ఇప్పటికే తనకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఆమె డేట్స్ ఇవ్వలేనని చెప్పిందట. దీంతో ఇప్పుడు మళ్లీ ఎంపిక మొదటికి వచ్చిందట. అఖిల్ సరసన నటించే ఆ ఛాన్స్ మరి ఎవరికి వస్తుందో!
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)