ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికా అభిమానుల ఉత్సాహం!

Wed, Dec 10, 2014
తమిళ తంబీలకి సినిమా పిచ్చి మనకంటే బాగా ఎక్కువే. తమ తమ హీరోల సినిమాల రిలీజ్ రోజున తమిళనాడులో అభిమానుల హడావుడి చూడాలీ ... మతిపోతుంది. పూనకం వచ్చిన వాళ్లలా ఊగిపోతారు! ఇప్పుడీ సందడి అమెరికాకు కూడా పాకేసింది. రజనీ నటించిన 'లింగా' సినిమా విడుదలకు ధియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేయడానికి ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోలను అమెరికాలో 100 స్క్రీన్స్ పై వేస్తున్నారు. మరీ ముఖ్యంగా షికాగోలో రజనీ ఫ్యాన్స్ హడావుడి భారీ స్థాయిలో ఉండబోతోంది. అక్కడి Rosemont IMAX ధియేటర్ ఈ సినిమా ప్రీమియర్ కి ప్రత్యేకంగా ముస్తాబవుతోంది. ఇండియా నుంచి తెప్పించిన 30 అడుగుల 'లింగా' బ్యానర్ ను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.



అలాగే, అభిమానులు ధరించడం కోసం లింగా T షర్టులు కూడా దిగుమతి చేసుకున్నారు. ధియేటర్ మొత్తాన్ని పూలదండలతో అలంకరిస్తున్నారు. ప్రేక్షకులందరికీ స్వీట్స్ పంచిపెట్టే కార్యక్రమం కూడా వుందట. అలాగే, మరీ ఉత్సాహవంతులైన ఫ్యాన్స్ కోసం ఉచితంగా 'ఈలలు' కూడా సరఫరా చేస్తున్నారు. తమ అభిమాన నటుడు 'పంచ్' డైలాగు కొట్టినప్పుడు వీళ్లు చెవులు పిక్కటిల్లేలా ఈలలకి పనిచెపుతారట. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఉంటుందని అక్కడి రజనీ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు జై బాల చెప్పాడు. ఈ సందడిని కవర్ చేయడానికి మీడియాని కూడా ఆహ్వానించారు. చూశారా ... దేశం కాని దేశంలో కూడా మన వాళ్ల సినిమా 'ఆరాధన' ఎలా వుందో... విశేషం ఏమిటంటే, ఈ ఫ్యాన్సంతా ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తలూనూ!
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)