ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చురకంటించిన సూపర్ స్టార్

Tue, Dec 09, 2014
రజనీకాంత్
రజనీకాంత్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ చురక అంటించారు. 'లింగా' చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న అల్లు అరవింద్ రజనీకాంత్ తో ఓ సినిమా నిర్మించాలని ఉందనీ, ఆయన ఓకే అంటే వెంటనే మొదలెడతాననీ అన్నారు. అయితే, దీనికి రజనీ తన ప్రసంగంలో చమత్కారంగా సమాధానం ఇచ్చాడు. "అరవింద్ గారు నాతో సినిమా చేయాలంటున్నారు. ముందు చిరంజీవికి మంచి కథ చూడండి. ఆ తర్వాత నాతో చేద్దురు గాని" అంటూ నవ్వుతూనే చురకేశాడు. చిరంజీవి నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' చిత్రాన్ని 1989లో రజనీకాంత్ హీరోగా అల్లు అరవింద్ 'మా పిళ్ళాయ్' పేరిట తమిళంలో రీమేక్ చేశారు. అది సూపర్ హిట్టయింది. ఆ తర్వాత మళ్లీ రజనీతో ఆయన సినిమా తీయడం కుదరలేదు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)