ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ రోజు 'లింగా' రిలీజవుతుందా?

Sat, Dec 06, 2014
కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు... పెద్ద హీరోల సినిమాల పైనే కేసులు కూడా పడుతుంటాయి. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమా కథ తనదేననీ, చిత్ర నిర్మాతలు కాపీ చేశారనీ ఆరోపిస్తూ ఇటీవలే ఓ రచయిత కోర్టులో కేసు వేశాడు. అయితే, కోర్టు దానిని కొట్టివేయడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇంతలోనే మరో రచయిత కూడా 'ఇది తన కథ' అంటూ కేసు వేశాడు. ఇలా పలు అవాంతరాలు ఎదురవుతుండడంతో నిర్మాతలకు తల నొప్పులు ఎక్కువవుతున్నాయట. ఓపక్క ఈ నెల 12న రజనీ బర్త్ డే సందర్భంగా దీనిని రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం చేసి, ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులు క్లియర్ చేసుకుని ఇది రిలీజవుతుందా? అన్నది అందర్లోనూ కుతూహలాన్ని రేపుతోంది.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)