ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఏమీ లేదంటున్న పూర్ణ!

Fri, Dec 05, 2014
పూర్ణ
పూర్ణ
'అతనితో నాకు ఎఫైరా... అయ్యో రామా ... ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదే!' అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది మల్లూ బేబీ పూర్ణ. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ చిన్నది టాలీవుడ్ కెమెరామెన్ భరణితో ప్రేమలో పడిందంటూ ఇటీవల వార్తలొస్తున్నాయి. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన సినిమాల వ్యవహారమంతా ఆయనగారే చూస్తున్నాడనీ, ఆయనేం చెబితే అదే చేస్తోందనీ కూడా ప్రచారం జరుగుతోంది. దీని గురించే పూర్ణ మాట్లాడుతూ, "అసలు భరణితో కలసి నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. ఏదో ఒకటి రెండు సందర్భాల్లో ఆయనని కలిసివుంటాను. అంతేతప్ప, ఆయనతో నాకెలాంటి సంబంధం లేదు" అంటూ చెప్పుకొచ్చింది. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది అమ్మడూ?
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)