ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజమౌళితో అయితే చేస్తాడట!

Fri, Dec 05, 2014
అజయ్ దేవగణ్
అజయ్ దేవగణ్
అమీర్ ఖాన్ ని డైరెక్ట్ చేయాలని మన తెలుగు దర్శకుడు రాజమౌళి ఉబలాటపడుతుంటే, ఈయన దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాలని మరో నటుడు అజయ్ దేవగణ్ కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని తనే తాజాగా చెప్పాడు. "గతంలో 'మక్కీ'కి రాజమౌళితో పనిచేశాను. ఆయన పనితనం నాకు బాగా తెలుసు. ఆయన కథను నడిపే తీరు, దర్శకత్వం అద్భుతం. ఆయనతో ఓ సినిమా చేయాలని వుంది" అని చెప్పాడు. 'ఈగ' సినిమా హిందీ వెర్షన్ 'మక్కీ'కి వాయిస్ ఓవర్ చెప్పడమే కాకుండా ... చివరి నిమిషంలో రాజమౌళి రిక్వెస్టుపై చిన్న ఫైట్ సీను కూడా చేశాడు అజయ్. అప్పుడే వీరి మధ్య అనుబంధం ఏర్పడింది. మరి, అజయ్ కోరికను ఈ దర్శకుడు నెరవేరుస్తాడా?
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)