ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐష్ తొలిసారి చేస్తోంది!

Mon, Dec 01, 2014
ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యా రాయ్ తొలిసారిగా ప్రముఖ దర్శకుడు కరణ్ జొహార్ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ చిత్రం పేరు 'ఏ దిల్ హై ముష్కిల్'. ఇందులో ఆమెతో బాటు రణబీర్ కపూర్, అనుష్కా శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఈ చిత్రం కూడా కరణ్ స్టయిల్ లో ప్రేమ, బంధాలు, కోరికలు వంటి సున్నితమైన అంశాల చుట్టూ సాగుతుంది. దీని గురించి దర్శకుడు కరణ్ చెబుతూ, "గతంలో కుచ్ కుచ్ హోతా హై సినిమా కోసం ఐష్ ని అడిగాను. అప్పుడు తాను 'జీన్స్' సినిమా షూటింగులో బిజీగా వుండడంతో చేయలేకపోయింది. ఆ తర్వాత 'కభి అల్విద నా కెహనా'కి అనుకున్నాను. అప్పుడూ కుదరలేదు. అయితే, వాటికి ఆమె సారీ చెప్పిన తీరు, కారణాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పింది" అన్నాడు. న్యూయార్క్, లండన్, పారిస్, ఢిల్లీ వంటి లొకేషన్లలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రాన్ని 3 జూన్ 2016న రిలీజ్ చేయడానికి కరణ్ అప్పుడే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)