ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రేంజ్ రోవర్' కారులో చరణ్

Fri, Nov 28, 2014
చిరంజీవిలానే తనయుడు రామ్ చరణ్ కి కూడా కార్ల మోజు బాగా వుంది. కొత్తగా ఏదైనా మోడల్ వస్తోందంటే ముందుగానే దాని గురించి తెలుసుకుని, తనకు నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తాడు. తాజాగా అలాగే, లాండ్ రోవర్ సంస్థ పరిచయం చేసిన 'రేంజ్ రోవర్' ఆటోబయోగ్రఫీ ఎడిషన్ ను సొంతం చేసుకున్నాడు. దీని ఖరీదు సుమారు 3.5 కోట్లు వుంటుంది. అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన, రక్షణ ఏర్పాట్లు గల ఈ కారును ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఖరీదు చేసిన తొలి బయ్యర్ రామ్ చరణే కావడం విశేషం. రాత్రి జరిగిన 'మేము సైతం' మీడియా సమావేశానికి అక్కినేని అఖిల్ ని ఎక్కించుకుని చరణ్ ఈ కొత్త కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ కారు అక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. పలువురు సినీ ప్రముఖులు దీని గురించి చరణ్ ను వివరాలు, విశేషాలు అడిగి తెలుసుకున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)